Ekasila Nagaram Ontimitta Ramalayam

ఏకశిలానగరం ఒంటిమిట్ట రామాలయం

సుప్రసిద్ద శ్రీ రామమందిరాలలో మహాపుణ్యక్షేత్రం గా ప్రసిద్దిగాంచింది కడపజిల్లా లోని ఒంటిమిట్ట రామాలయం.
ఈ ఆలయం కడప నుంచి సుమారు 25 కి మీ దూరం లో వుంది.

క్షేత్ర ఐతిహ్యం

త్రేతాయుగం లో ఈ ప్రాంత పరిసరాల్లో మునులు తప్పస్సులు యాగాలు నిర్వహిస్తువుండేవారు వారిలో మ్రుకండు మహర్షి శృంగిమహర్షి యాగం నిర్వహిస్స్తూ ఉన్నపుడు వారికి రాక్షసులు యాగం జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నపుడు ఆ మహర్షులు రామచంద్రమూర్తి గూర్చి ప్రార్ధించగా అప్పుడు ఈ క్షేత్రానికి సీతారామలక్ష్మణులు రాక్షసులను హతమార్చటానికి అంబులపొది, పిడిబాకు కొదండాలతో వచ్చారు.కనుక ఇచ్చట రాములవారికి కోదండరామస్వామి అని పేరువచ్చింది.

సీతారామలక్ష్మణులు ఈ పరిసర ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సీతాదేవి రాములవారిని ఈ పరిసరప్రాంతంలో వన్యప్రాణులకు మరియు జంతుజలాలకు నీళ్ళు లేవని ప్రశ్నించినప్పుడు రాములవారు సీతదేవికి దాహంగా వుందని గ్రహించి ఓ బాణం వేయగా…ఇచ్చట నీళ్ళుపడినది ఆనీళ్లు పడినచోట రామతీర్ధం అని పీరు వచ్చింది. లక్ష్మణుడు బాణం వేయగా పడిన తీర్దానికి లక్ష్మణ తీర్ధం అని పేరు వచ్చినది.

ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి లేని కారణం:
మునుల యాగం పరిసమాప్తి అయిన పిదప సీతారామలక్ష్మణులు మూర్తులు ఒకే రాతిపైవుండి ఒకే మారు ధ్యానించేందుకు తగ్గట్లు జాంబవంతుడు ఈ మూగ్గురు మూర్తులను ఒకే రాతిపై వుండేటట్టుగా ప్రాణప్రతిష్ఠ చేసారు కావున జంబావంతుని ప్రతిష్ట అని అంటారు,అప్పుడు ఆంజనేయస్వామి కన్నా జాంబవంతుడు పెద్దవాడు కావున ఇచ్చట గుడిలో ఆంజనేయస్వామి కానరాడు, మరికొంత కాలానికి దేవాలయ ముఖద్వారానికి అభిముఖంగా శ్రీ సంజీవరామస్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది.

ఆలయ నిర్మాణ చరిత్ర:
ఈ దేవస్థానం మూడు దఫాలుగా నిర్మించినట్లు ముఖమండపంలోని 11 శతాబ్ధం నాటి శిల్పాలు శాసనాల ద్వారా మనకు దేవాలయ చరిత్ర మనకు తెలియచున్నది.

శ్రీ కోదండరామాలయ మహా గోపురం ఉత్తర బాగాన రెండు శిలశాసనాలు వున్నాయీ. దేవస్థానం లోని ముఖమండపం లో రామయణంలోని ఘాట్టాలు, మహాభారతం లోని ఘాట్టాలు, దశావతారాలు వటపత్రశాయ్ చిత్రాలు, రామసేతు కి బండరాయీ మోస్తున్నఆంజనేయస్వామి దృశ్యచిత్రం తదితర రూపాలు చూపరులకు ఆనందాన్ని కలుగ చేస్తాయీ.

ఆలయం లోని ముఖమండపం లో 32 స్తంభాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.ఎత్తైన కళ్యాణమండపం లో సీతారాముల వివాహానికి ముందుగా జరిగే ఎదురుకోలు మండపాలు రెండు,శిల్పసౌందర్య సంపదచే చూడ ముచ్చట గోలుపుతున్నాయీ.దేవస్థాన ముఖద్వారానికి గల ఎత్తైన 160 అడుగుల గోపురం ముఖద్వారం లో ఒక రాతిపై ఏనుగు ఆవు మరియు ఇతర శిల్పాలు వున్నాయీ. పూర్వం 1652 సంవత్సరం లో ఒక విదేశి యాత్రికుడు అతని పేరు టవర్నీయ భారతదేశం లోని గొప్ప కట్టడాలలో ఒంటిమిట్ట రామాలయం గొప్ప కట్టడం అని పేర్కొన్నాడు.

స్వామివారి రోజువారి సేవలు
సుప్రభాతం – ఉదయం 5.00 గంటలకు
అభిషేకం – ఉదయం 5.30 గంటలకు
అలంకారం – 6.30 గంటలకు
సహస్రనామార్చన -7.00 గంటలకు
సర్వదర్శనం – ఉదయం 7 గంటల నుంచి
ఏకాంత సేవ – రాత్రి 8.00 గంటలకు

Advertisements